అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38మందికి మరణ శిక్ష..
అహ్మదాబాద్ (CLiC2NEWS): గుజరాత్లోని అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం 48 దోషుల్లో 38 మందికి మరణ శిక్షను విధించింది. మిగిలిన 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.
2008 జూలై 26న అహ్మదాబాద్ నగరంలో 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 56 మంది చనిపోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 78 మందిని ఈరెస్టు చేశారు. వీరికి నిషేధిత ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎమ్)తో సంబంధాలున్నాయని గుర్తించారు. మొత్తం 13 సంవత్సరాలుగా జరిగిన విచారణలో 1,100 మంది సాక్ష్యులను విచారించారు. గత సంతవత్సరం విచారణ ముగియగా వీరిలో 49 మందిని దోషులుగా నిర్థారిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.