గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై జలశక్తి శాఖ సమావేశం..
ఢిల్లి (CLiC2NEWS): గోదావరి-కావేరి అనుసంధానంపై ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. నదుల అనుంసంధానం అంశంపై చర్చకు రావల్సిందిగా 4 రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయంతెలిసినదే. కేంద్ర ప్రభుత్వం మొదట మహానది, గోదావరి , కృష్ణా , పెన్నా, కావేరి నదుల అనుసంధానం చేయాలని భావించింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్లయూడిఎ) ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి ఎపి, తెంగాణ, కర్ణాటక, తమిలనాడు, పుదుచ్చేరి రాష్ట్ర జలశక్తి అధికారులు హాజరయ్యారు. ఈసమావేశంలో 237 టిఎంసిల జలాల తరలింపుపై చర్చించారు. జాతీయ ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాలు 40% నిధులు భరించాల్సి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు భరిస్తుందని కొత్త ప్రతిపాదన. నదుల అనుసంధానానికి అవసరమైన భూసేకరణ, ఏ ప్రాజెక్టు నుండి ఏ ప్రాజెక్టుకు అనుసంధానం చేయొచ్చు, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా ? అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కాదని.. కేవలం అభిప్రాయాలు తెలుసుకోవడానికి అని జలశక్తి శాఖ అధికారులు పేర్కొన్నారు. తదుపరి సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.