మేడారం వన దేవతలను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్..
ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవాలనే రోడ్డు మార్గంలో వచ్చాను: గవర్నర్ తమిళిసై
మేడారం (CLiC2NEWS): సమ్మక్క – సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా జరింగింది. జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకనేందుకు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమ్మవార్లను దర్శించుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు అందరూ ఐశ్వర్యం, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అమ్మవార్లను ప్రార్ధించినట్లు తెలిపారు.
గవర్నర్ మాట్లాడుతూ. భక్తులతో లిసి అమ్మవార్లను దర్శించుకోవాలనుకున్నాను. రాష్ట్ర గవర్నర్‌గా నాకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అడగలేదు. నేను ప్రజలలో ఒకదానిగా ఉండాలనుకుంటున్నాన్నారు. సాధారణ భక్తుల మాదిగానే సమ్మక్క – సారలమ్మ ను దర్శించుకోవాలన్నది నా ఆకాంక్ష. ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవాలనే రోడ్డు మార్గంలో వచ్చానన్నారు. ఈ పర్యటన వలన సాధారణ భక్తులకు అసౌకార్యానికి గురైతే నన్ను మన్నించాలని గవర్నర్ అన్నారు.