ఫార్మా హబ్‌గా తెలంగాణ..
13వ బయో ఏషియా సదస్సు
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ ప్రపంచ ఫార్మా హబ్‌గా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్ర మలు, పురపాలశాఖామంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన 13 వ బయో ఏషియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో చర్చాగోష్ఠి నిర్వహించారు. కొవిడ్ సవాళ్లు, ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెన్స్ రంగ భవిష్యత్‌పై బిల్ గేట్స్‌తో కెటిఆర్ చర్చించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు ? కరోనాలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు భారత్ వేగంగా స్పందించిందన్నారు. భారత్ ఔషధ కంపెనీలు త్వరగా వ్యాక్సిన్లు తయారు చేశాయని , ఇంకా వ్యాక్సిన్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉందన్నారు. భవిష్యత్తులో అనేక వైరస్‌లు దాడి చేయవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని బిల్‌గేట్స్ తెలిపారు.