నిండు జీవతానికి రెండు చుక్కలు..
మహబూబాబాద్ (CLiC2NEWS): నేడు(ఆదివారం) ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియే చుక్కల పంపిణీ జరుగుతుంది. అన్ని పిహెచ్ సీలు, సామాజిక, ప్రాంతీయ, అంగ్న్వాడీలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,ఇతర ముఖ్య ప్రాంతలలో పోలియో చుక్కల పంపిణీ కొనసాగుతుంది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాద్ జిల్లాలోని కురవి మండలంలో పిల్లల్ పోలియో చుక్కలు వేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్రలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలపూ ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత రాష్ట్రంగా మన తెలంగాణను కొనసాగించాలని ఆమె కోరారు.