తక్షణమే కాల్పులు విరమించండి.. ఐకాస సాదారణ సభ
హింసతో పరిష్కారం లభించదు..
ఉక్రెయిన్ -రష్యా దేశాలు తక్షణమే కాల్పలు విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి సాదారణ సభ పిలుపినిచ్చింది. ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉక్కెయిన్పై రష్యా సైనిక చర్యలో మృతులకు సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. ఉక్రెయిన్ నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో ఐక్కరాజ్యసమితి సాదారణ సభ 11వ అత్యవసర సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించింది.
హింసతో పరిష్కారం దొరకదు.. శాంతితోనే పరిష్కారం లభిస్తుంది.
ఇరుదేశాల సైన్యాలలు వెనక్కి వెళ్లిపోండి ప్రజలకు రక్షణ కల్పించండి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షడుకి హామీ ఇచ్చారు.