ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి

కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖార్కీవ్‌లో జరిగిన ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో ఇద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందర్ బాగ్చి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్లర్‌లో వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మృతుడిని కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా వాసి నవీన్‌గా గుర్తించారు. ఈ మేరకు చినిపోయిన విద్యార్థి కుటుంబానికి సమాచారం అందించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. విద్యార్థి ఉక్రెయిన్‌లోని వైద్య విద్య నాలుగో ఏడాది చదువుతున్నట్లు పేర్కొంది. ఖార్కివ్‌లోని సర్కార్ భవనాలే లక్ష్యంగా రష్యా సేనలు బాంబు దాడులు జరుపుతున్నాయి. కాగా అవి గురి తప్పి నవీన్ ఉంటుంటున్న నివాస ప్రాంతంపై పడినట్లు తెలుస్తోంది.
తప్పకచదవండి:మిలిటరీ బేస్‌పై దాడి.. 70 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి