ఒక్కరోజే ఆరు విమానాల్లో 1377 మంది భారత్‌కు..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజులో 1300 మందికి పైగా భారతీయులను ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తరలించారు. 24 గంటల వ్యవధిలో ఆరు విమానాల్లో 1377 మంది భారతీయులను తరలించడం జరిగిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్విటర్లో పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల్లో మరో 26 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్‌లో భారత పౌరులెవరరూ లేరని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.