రొమేనియాకు బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన సి-17 విమానం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి చెందిన విమాలను పంపడానికి సిద్ధమైనదని తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, గాజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్‌బేస్ నుండి బుధవారం వాయుదళానికి చెందిన సి-17 విమానం ఢిల్లీ నుండి రొమేనియాకు బయల్దేరింది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించేందుకు అవకాశముంటుందని అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యల కోసం అవసరమైన సామాగ్రిని ఇందులో పంపించారు. ఈ విమానం తిరుగు ప్రయాణంలో భారత పౌరులను తీసుకురానున్నారు. ఈవిమానాలు ఐఎఎఫ్‌కు చెందిన అతిపెద్ద రవాణా విమానాలు. ఇవి ఒక్కొక్క విమానం సుమారు 300 మందిని తరలించగలవు.