ఇంటి ముందు కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిన వ్యాను.. న‌లుగురు మృతి

 

క‌డ‌ప (CLiC2NEWS): జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌డ‌ప‌జిల్లా చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లం మ‌ద్దిమ‌డుగులో అతి వేగంగా వ‌చ్చిన వాహ‌నం ఢీకొట్టి న‌లుగురు వ్య‌క్తులు మృత్యువాత ప‌డ్డారు. ఇంటి ముందు కూర్చున్న వారిపైకి బొలేరో వాహ‌నం వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. మ‌ర‌ణించిన‌వారు కొండ‌య్య, అమ్ములు, దేవి, ల‌క్ష్యీదేవి గా గ‌ర్తించారు. కొండ‌య్య‌, ల‌క్ష్మీదేవి అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. అమ్మ‌లు, దేవిల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మృతిచెందారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.