ప్రయాణికులకు టిఎస్ ఆర్టిసి శుభవార్త..

హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్ ఆర్టిసి ప్రయాణికులకు ఆర్టిసి ఎండి సజ్జనార్ మరో శుభవార్తనందించారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వారి ఇంటి వద్దనుండి బోర్డింగ్ పాయింట్ వరకు ఆర్టసీ బస్సల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్లు ట్విటర్ వేదకగా వెల్లడించారు. జంట నగరాల్లో ప్రయాణానికి 2 గంటల ముందు, ప్రయాణం తర్వాత 2 గంటల సమయం వరకు ఈ అవకావం వర్తిస్తుందని వెల్లడించారు.
250 KM ల పై ఉన్న దూర ప్రాంతాలకు ముందస్తు #TSRTCTicket రిజెర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ఇంటి వద్ద నుండి #TSRTCBus ఎక్కు ప్రాంతం వరకు సిటీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. #Hyderabad జంటనగరాలలో ప్రయాణానికి 2 గంటలు ముందు, మరియు ప్రయాణం తర్వాత 2 గంటలు వర్తించును. #TSRTCFreeBusTravel pic.twitter.com/YIZLPcIH8Y
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 2, 2022