భారతీయ విద్యార్థులు తక్షణమే ఖర్కివ్‌ను వీడండి..
భారత్ ఎంబసీ కీలక ప్రకటన
ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కాలినడకనైనా ఖర్కివ్ నుంచి వెళ్లిపోవాలని భారత ఎంబసీ పలు కీలక సూచనలు చేసింది. ల్వీవ్‌లోని భారత రాయబార కార్యాలయం మరోసారి అత్యవసర మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్యా సేనలు యుద్ధాన్ని ఉద్ధృతం చేసిన తరుణంలో పరిస్థితులు క్షీణించడంతో అక్కడినుంచి త్వరగా వెళ్లిపోవాలని సూచించింది. వాహనాలు దొరక్కపోతే కాలినడకన అయినా ఆ నగరం నుండి పెసోచిన్, బాబే, బెజ్లిడోవ్యా నగరాలకు తక్షణమే తరలిపోవాలని సూచించింది.
మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కీవ్ నుండి ల్వీవ్‌కు మారిందని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.