ఎపిలో ఇంటర్ పరీక్షలు వాయిదా..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జెఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుండి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన కారణంగా ఏప్రిల్ 8 నుండి 28 వరకు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేవ్ తెలిపారు.
ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుండి మే 12 వతేదీ వరకు జరగనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఇదివరకు ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 నుండి మార్చి 31 వరకు ) జరుగుతాయని తెలిపారు. వీటి కొరకు 1400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని ఆయన తెలిపారు.