ఉన్నతన్యాయస్థానం తీర్పుపై అమరావతి రైతుల కృతజ్ఞతలు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్డిఎ) రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. హైకోర్టు వద్ద పలువురు రైతులు సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో కిలోమీటరు మేర రహదారిపై బారులు తీరి రైతులు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమరావతి పరిసర ప్రాంతాల్లోని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొంటున్నారు.