ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం రష్యా బస్సులు..

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించేందుకు 130 బస్సులను సిద్ధం చేసినట్లు రష్యా తెలిపింది. ఖర్కివ్, సుమీ నగరాల్లోని ఇతర దేశాల పౌరులను తరలిస్తున్నట్లు వెల్లడించింది. రష్యాలోని బెలగోరోడ్ ప్రాంతానికి వీరిన చేర్చుతున్నట్లు ఆదేశ సైనిక జనరల్ వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ లోని ప్రాంతాయ పరిపాలనా భవనాన్ని రష్యా సైనిక దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఖేర్సన్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు.