ఉక్రెయిన్ నుండి వచ్చిన వైద్య విద్యార్థులకు స్వదేశంలో ఇంటర్న్‌షిప్‌నకు అనుమతి..!
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎం సి) నిర్ణయం
ఢిల్లి (CLiC2NEWS): ఉక్రెయిన్-రష్యాల మద్య యుద్ధం కారణంగా అక్కడి నుండి చదువులన వదిలి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు మన దేశంలోనే ఆయ కోర్సులను పూర్తిచేసే అవకాశం లభించనుంది. ఆరేళ్ల ఎంబిబిఎస్ పూర్తి చేసుకొని ఇంటర్న్‌షిప్ మధ్యలో ఉన్న వారు, ప్రారంభించాల్సిన విద్యార్థులకు భారత్‌లోనే ఆ అవకాశాన్ని కల్పించాలని జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించింది. అయితే కొన్ని షరతులకు లోబడి అనుమతించింది.
ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్ డిగ్రీ ఆరేళ్లు పూర్తయిన తర్వాత ఇంటర్న్‌షిప్ రెండేళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. ఎన్ ఎం సి ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారు అక్రడే ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేయాలి. మన దేశంలో వైద్యుడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాడానికి అనుమతి పొందాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ ఎంజిఇ) లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ నుండి వచ్చిన విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్ భారత్‌లో పూర్తిచేయడానికి దరఖాస్తు చేసుకోవాడానికి ముందే సదరు విద్యార్థులు ఎఫ్ ఎంజిఈ లో ఉత్తీర్ణులై ఉండాలని ఎన్ ఎంసి స్పష్టం చేసింది.