రష్యా దాడులలో 79 మంది చిన్నారుల మృత్యువాత: ఉక్రెయిన్ వెల్లడి
కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రాష్యా దాడులతో ఉక్రెయిన్ పౌరులు అధికంగా మరణిస్తున్నారు. వీరిలో చిన్నారులు 79 మంది మృతిచెందారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ పసిబిడ్డల మృతిపై ఇటీవల ఆదేశ ప్రథమ పౌరురాలు వొలెనా జెలెన్ స్కా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాలు, పాఠశాలలు, హాస్పిటల్స్ కూడా ధ్వంసం అవుతున్నాయి. ఇప్పటివరకు 202 పాఠశాలలు, 34 ఆసుపత్రులు, 1500 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి.