IND vs SL: భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 303/9 డిక్లేర్డ్
బెంగళూరు (CLiC2NEWS): బెంగళూరు వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 303 9 స్కోర్ డిక్లేర్డ్ చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ (67), రిషబ్ పంత్ (50) అర్ధ సెంచరీలు చేశారు. పంత్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ 46, హనుమ విహారి 22, కోహ్లీ 13 జడేజా 22 అశ్విన్ 13 అక్షర్ పటేల్ 9, మహ్మద్ షమి 16 * పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 252 పరుగులకే ఆలౌటయిన విషయం తెలిసినదే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో టీమ్ ఇండియా శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.