కొత్త వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచం చూపు హైద‌రాబాద్ వైపే: మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ (CLiCWNEWS): ఖైర‌తాబాద్‌లో 12-14 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి  హ‌రీశ్ రావు ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ కేసుల‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిస్తోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని అన్నారు. ప్ర‌పంచం అంతా కొత్త వ్యాక్సిన్ కావాలంటే హైద‌రాబాద్ వైపే చూస్తుంద‌ని, దేశంలో కొవిడ్‌కు మూడు వ్యాక్సిన్‌లు వ‌స్తే అందులో రెండు హైద‌రాబాద్లో త‌యారైన‌వే అని పేర్కొన్నారు. కొవాగ్జిన్‌, కొర్బొవాక్స్ టీకాలు హైదరాబాద్ నుండే రావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌మూదా్ అలీ, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, బ‌యోలాజిక‌ల్‌-ఇ ఎండి మ‌హిమ దాట్ల పాల్గొన్నారు.

క‌రోనా ప్ర‌భావం త‌గ్గిపోయింద‌ని నిర్ల‌క్ష్య ధోర‌ణి వ‌ద్ద‌ని మంత్రి అన్నారు. థ‌ర్డ్‌వేవ్ ప్ర‌భావం చూప‌లేద‌ని ప్ర‌జ‌లు నిర్లక్ష్యంగా వ్వ‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని, అంద‌రూ విధిగా వ్యాక్సినేష‌న్ తీసుకోవాలని సూచించారు. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.