గేట్ 2022 ఫలితాల్లో వరంగల్ NIT విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు

వరంగల్ (CLiC2NEWS): గేట్ – 2022 ఫలితాల్లో తెలంగాణ విద్యర్థులు సత్తా చాటారు. వరంగల్ ఎన్ ఐటి విద్యార్థి అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఎన్ ఐటి వరంగల్‌లో కెమికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మణి సందీప్‌రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. నీట్ సంచాలకులు ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు ఈ సందర్భంగా సందీప్‌రెడ్డిని అభినందించారు.
అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన నిరంజన్ మెటర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు.
Mr. T Mani Sandeep Reddy, final year BTech Chemical student secured AIR 1 in GATE 2022. pic.twitter.com/uGZBMab3VJ
— NIT WARANGAL (@warangal_nit) March 17, 2022