RRR సినిమా టెకెట్ రేట్లు పెంచుకునేందుకు ఎపి సర్కార్ అనుమతి!
అమరావతి (CLiC2NEWS): ఆర్ ఆర్ ఆర్ సినిమా టెకెట్ రేట్లు పెంచుకునేందుకు ఎపి సర్కార్ అనుమతించిందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా టెకట్ ధరలను నిర్ధారిస్తూ జారీ చేసిన జీవో నెం.13 ప్రకారం సినిమా రేట్లు మొదటి పది రోజులకు పెంచుకోవచ్చని మంత్రి వివరించారు.
ఈ విషయంపై తాజాగా మంత్రి పేర్ని నాని స్పందించారు. “దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ. 100 కోట్లు బడ్జెట్ దాటితే.. సినిమా విడుదలైన 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉందని జీవో నం. 13లో పొందుపరిచాయం. అందులో భాగంగానే “ఆర్ ఆర్ ఆర్“ నుంచి టికెట్ ధరల పెంపునకు వితి పత్రం అందింది. జీఎస్‌టి, దర్శకుడు, నటీనటులపారితోషికం కాకుండా చిత్రానికి రూ. 336 కోట్లు ఖర్చు చేసినట్లు విత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు చిత్రం బృందం సమర్పించిన వివరాలను పరిశీలిస్తున్నారు. .. ఎపిలో 20 శాతం సినిమా షూటింగ్ నిబంధన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు వర్తించదు. ఎందుకంటే జీవో రావడానికి ముందే ఈ సినిమా నిర్మించారు. కొత్తగా నిర్మించే సినిమాలకు ఈ నిబంధన తప్పకుండా వర్తిస్తుంది. “ అని మంత్రి పేర్కొన్నారు.