మెట్రోలో ప్ర‌యాణించిన మంత్రి కొప్పుల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మెట్రో రైలులో ప్రయాణించారు. గురువారం పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ‌న్ కోలేటి దామోద‌ర్ గుప్తాతో క‌లిసి హైద‌రాబాద్ మెట్రో రైలులో ప్ర‌యాణించారు.
అసెంబ్లీ మెట్రో స్టేష‌న్ నుంచి విక్టోరియా మెమోరియ‌ల్ స్టేష‌న్ వ‌ర‌కు మంత్రి మెట్రోలో ప్ర‌యాణించారు. స‌రూర్ న‌గ‌ర్‌లోని వి. ఎం. హోం గురుకుల పాఠ‌శాల‌లో ఆరోగ్య ప‌రీక్ష‌ల శిబిరాన్ని ప్రారంభించేందుకు గాను మంత్రి మంత్రి మెట్రో ట్రైన్‌లో ప్ర‌యాణం చేశారు. విక్టోరియా మెమోరియ‌ల్ మెట్రో స్టేష‌న్ నుంచి మంత్రి కారులో పాఠ‌శాల‌కు చేరుకున్నారు. ఈ ప్ర‌యాణం కొత్త అనుభితిని ఇచ్చింద‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.