ఉక్రెయిన్‌పై ‘నో ఫ్లై జోన్’ కు అమెరికా విముఖ‌త‌!

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌పై ర‌ష్యా కొన‌సాగిస్తున్న దాడుల కారణంగా ఆదేశం అంతా అల్లాడిపోతుంది. ఆదేశాన్ని అధీనంలోకి తీసుకునేందుకు ర‌ష్యా రోజురోజుకీ దాడులు ముమ్మ‌రం చేస్తుంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగాలంటే త‌మ గ‌గ‌న‌త‌లంపై ‘నో ఫ్లై జోన్’ విధించాలంటూ ఆ దేశాధ్య‌క్షుడు జెలెన్ స్కీ అభ్చ‌ర్ధిస్తూనే ఉన్నారు. ఇందుకు అమెరికా విముఖ‌త చూపిస్తుంది. “ఈ విష‌యంపై అమెరికా అధ్య‌క్ష‌డు జో బైడెన్ స్ప‌ష్టంగా ఉన్నారు. ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్నినో ఫ్లై జోన్ గా ప్ర‌క‌టించ‌లేమ‌ని పెంట‌గాన్ డీఫ్ లాయిడ్ ఆస్టిన్ ఓ అంత‌ర్జాతీయ మీడియాకు వెల్ల‌డించారు.  యుద్ధంలో ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఉక్రెయిన్‌కు మేం సాయుధ బ‌ల‌గాల‌ను పంపం. అలాగే నో ఫ్లై జోన్ ను కూడా విధించ‌లేం. నో ఫ్లైజోన్ విధించ‌డం అంటే గ‌గ‌న‌త‌లంపై నియంత్ర‌ణ తీసుకోవ‌డ‌మే. అంటే ర‌ష్యా విమానాల‌ను ప‌డ‌గొట్ట‌డ‌మే. అంటే ర‌ష్యాతో నేరుగా యుద్ధానికి దిగ‌డ‌మే. అలాంటి ప‌రిణామాలు ఎవ‌రూ చూడాల‌నుకోవ‌ట్లేదు. అది ఆ ప్రాంతానికి, యావ‌త్ ప్ర‌పంచానికి మంచిది కాదు” అని ఆస్టిన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.