గోరింటాకు వ‌ల‌న ప్ర‌యోజ‌నాలు

గోరింటాకు .. ఇది పెళ్లికూతురుకి పెట్టకపోతే బహుశా పెళ్ళిలో అంత మజా కానీ, పెళ్లికూతురు ముఖంలో కళ, కాంతి,, సౌందర్యం,చిరునవ్వు, పెళ్లికూతురు గుండెలోతులో వున్న ప్రేమ, కనపడదు. పెళ్లికూతురుకి కాక మిగతా వారు కూడా సాందర్యం కోసం, చేతులు అందంగా కనపడటానికి, చేతులకు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ రాకుండా చర్మవ్యాధులు వచ్చిన తగ్గటానికి, మరియు శరీరంలో వున్న వేడిని తగ్గించటానికి పరిపూర్ణమైనది, జుట్టు తెల్లగా ఉంటే నల్లగా దీనిని పెట్టుకుంటే నల్లగా మార్చేది కూడా గోరింటాకునే.

వైజ్ఞానిక భాషలో lawsonia inermis:L

English లో హెన్నా,
సంస్కృతంలో రక్త, రంగా, రాగ, గర్మి, మాదయంతి, రంజిక, నఖ రంజని అంటారు.
హిందీలో మెహంది.
తమిళ్ లో కూరంజి,
అరబీలో హీన, అల్ హీన అని అంటారు.

గోరింటాకు ఆకులు ఆయుర్వేదంలో చాలా రోగాలకు చక్కని ఔషదంగా వాడుతాము. దీని ఆకులు చాలా చక్కగా సాధాబహార్ లాగా స్మూత్ గా ఉంటాయి. స్త్రీలకు శృంగారంలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. గోరింటాకు అంటే పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, యువతులకు, యువకులకు, ముసలివారికి, అందరికి ఇష్టమే, ఏ మంచి కార్యక్రమం జరిగిన పెళ్ళికి, పండుగలకు, సరదా వేరు వూరిలో చుట్టాల ఇంటికి వెళుతున్నపుడు కూడా పెట్టుకుంటారు.గోరింటాకు స్త్రీకి, దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన చెట్టు, గోరింటాకు పెట్టుకోవటం కోసం స్త్రీగా పుట్టటమే ఒక వరం.
ఇపుడు గోరింటాకు ఆకులు ఎండలో ఎండపెట్టి మార్కెట్లో ఆకర్షనియమైన పాకెట్లో అమ్ముతున్నారు.

బాహ్య స్వరూపం.

ప్రకృతిలో ఒక అద్భుతమైన మొక్కగా గోరింటాకు పేరుంది. కొద్దిగా పొడవుగా హస్వావృత్త మలయాకర్, గుడ్డు ఆకారంలో అభిముఖంలో ఉంటుంది. పుష్పాలు సుగంధిత శ్వేత వర్ణంలో ఉంటంది. కాయ పచ్చి బఠాణి లాగా ఉంటుంది. అక్టోబర్ నవంబర్‌లో పుష్పాలు, తరువాత కాయలు కాస్తాయి.

తెల్లజుట్టు వున్నవారు గోరింటాకుని రి పేస్ట్ లాగా చేసి తలకు రాసుకుంటే తెల్లజుట్టు కొన్నిరోజులలో నల్లగా మారుతుంది.

చిన్న పెద్ద తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ అన్ని పండుగలకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది అరబ్, దేశాలలో ఎక్కువగా దీనిని లేడీస్ పెట్టుకుంటారు. ఇప్పుడు అన్ని దేశాలవారు ఫ్యాషన్ గా పెడుతున్నారు.

స్త్రీలకు, మరియు పురుషుల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే స్త్రీకి అయితే మంచి అందగాడు, మంచి గుణాలు కలవాడు భర్తగా వస్తాడు అని, మగవారి చేతులు ఎర్రగా పండితే సౌందర్యవతి, అందంగా ఉండేవారు, చక్కని గుణగణాలు కలిగిన స్త్రీ భార్యగా దొరుకుతుంది అని అందరు చెపుతారు.

సంఘటనలు
గోరింటాకు ఆకులలో టైనిన మరియు వాసోన్ ముఖ్యమైన ద్రవ్యాలు వున్నవి

గుణధర్మాలు 

దాహం, కామెర్లు, దీని లేపణంతో నొప్పులు తగ్గుతాయి.వ్రణాశోధనం
దీని ప్రయోజనాలు

  •  వేడి వలన, పిత్త ప్రకోపం వలన తల నొప్పి వస్తే 50 గ్రాముల గోరింటాకు ముద్దను 100 గ్రాముల కొబ్బరినూనెలో వేసి వేడి చేసి, ఆ నూనే ని తలకు రాసుకుంటే తల నొప్పి తగ్గుతుంది.
  •  గోరింటాకు పూలు 5 గ్రాములు తీసుకొని కొద్దిగా నీరు కలిపి మెత్తగా దంచి గుడ్డతో వడపొసి దీనిలో 8 గ్రాములు తేనే కలిపి కొద్దిరోజులు కడుపులోకి తీసుకుంటే వేడి వలన వచ్చి శిరో రోగాలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతంగా వుంటారు.
  •  నోటిలో పుండ్లు వస్తే గోరింటాకు ఆకులు 10 గ్రాములు మరియు 200 గ్రాములు నీటిలో నానా పెట్టి రెండు గంటల తరువాత నీటిని వడ గట్టి, ఈ నీరుతో గండూషం (పుక్కిట )పట్టాలి.దీనితో నోటిలో పుండ్లు తగ్గుతాయి.

  •  నిద్ర రాకపోతే.. గోరింటాకు విత్తనాలు దిండులో వేసి, a దిండు తల కింద పెట్టుకుంటే చక్కని నిద్ర వస్తుంది.
  •  తెల్ల జుట్టుకి నల్లగా జుట్టుగా మార్చటానికి గోరింటాకు, పెరుగు, నిమ్మరసం, టీ పొడి, అన్ని కలిపి తలకు రాసుకోవాలి.
  •  గోరింటాకు ముద్దగా చేసి కండ్ల మీద ఒక పది నిముషాలు పెడితే కండ్లు మంట తగ్గుతాయి. కంటి రోగాలు తగ్గుతాయి.
  •  కామెర్లు వచ్చిన వారికీ కూడా ఇది ఔషదం గా పనిచేస్తుంది.
  •  గోరింటాకు పై బెరడు 10 గ్రాములు రాత్రి మట్టి కుండలో వేసి ఉడికించి, తెల్లవారుజామున దానిని వడ పోసి తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
  •  గోరింటాకు నూరి తలకు, చేతులకు, పాదాలకు పెట్టుకుంటే కంటికి చలువగా ఉంటుంది.
  • చ‌ర్మ‌వ్యాధులు వున్న చోట, పుండ్లు వున్న చోట గోరింటాకు నూరి పెడితే అన్ని తగ్గుతాయి.
  • చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చేతులు అందంగా ఉంటాయి.ముఖంలో, ఓజం, తేజం, కాంతి, వస్తాయి.

ఆయుర్వేద వైద్యుడు

షేక్. బహర్ అలీ.

Leave A Reply

Your email address will not be published.