కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో 132 మంది…
బీజింగ్ (CLiC2NWS): చైనాలోని ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 132 మందితో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం దక్షిణ ప్రావిన్స్‌లోని యుయాన్జి ప్రాంతంలో గ్జీలో కూలిపోయింది. ఈ ప్రమాదం సమాయంలో విమానం లో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్ నగరం నుంచి గుయాంగ్ ఝౌ నగరానికి బయల్దేరిన ఈ స్త్రన్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో్ల ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వద్ద సమాచారం ఉంది. వెంటనే గుయాంగ్జి ప్రాంతోని పుజౌ నగర సమీపంలో పర్వతాన్ని ఢీ కొట్టి కుప్పికూలినట్లు తెలుస్తోంది.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో భారీగా మంటు చెలరేగినట్లు చైనా కు చెందిన పలు మీడియా సంస్థలు కథలునాలు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రులపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.