పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

హైద‌రాబాద్  (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 87 పైస‌లు పెంచారు. పెరిగిన ధ‌ర‌లు నేటి నుండి అమ‌లులోకి వ‌స్తాయి. హైదరాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 109.10 పైస‌లు, డీజిల్ రూ. 95.40 పైస‌లకు చేరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై 88 పైస‌లు, డీజిల్‌పై 83 పైస‌లు పెరిగింది. దీంతో విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 110.80 పైస‌లు, డీజిల్ రూ. 96.83గా ఉంది.

రోజ‌రోజుకు చ‌మురు సంస్థ‌ల న‌ష్టాలు పెరుగుతుండ‌డంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం అనివార్యంగా మారిన‌ట్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కార‌ణంగా ఇటావ‌ల అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు అధికంగా పెరిగాయి.

Leave A Reply

Your email address will not be published.