TS: బిసి గురుకుల బోధనా సిబ్బంది వేతనాలు పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): మహాత్మా జ్యోతిబాపూలే బిసి గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం మార్చి నుండి పెంచిన వేతనాలు అమలులోకి రానున్నట్లు బసి సంక్షేమ శాక ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. గెస్ట్ టీచర్‌కు గతంలో గంటకు రూ. 140 చెల్లించగా.. పెరిగిన వేతనం ప్రకారం గంటకు రూ. 240 చెల్లించనున్నారు. గెస్ట్ లెక్చరర్‌కు గంటకు రూ. 180 చెల్లించేవారు. ఇప్పుడు రూ. 270కు పెంచారు.
అదేవిధంగా బోధనా సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది వేతనాలు కూడా పెంచామని బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలోని బిసి గురుకుల విద్యాసంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరం కోసం నోటిఫికేషన్ విడుదల చేశామని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగితి పరీక్ష రాస్తున్న వారు ఇంటర్ కోర్సుల కోసం, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష రాస్తున్న బాలికలు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.