సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): బోయగూడలోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందారు. సికింద్రాబాద్ బోయగూడలోని స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి.. భవనము పైనున్న టింబర్ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న 11 మంది మరిణించారు. ప్రమాద సమయంలో అక్కడ 12 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒక వ్యక్తి మంటలు వ్యాపించగానే భవనంపై నుండి దూకాడని చెప్పారు. ఘటనా స్థలానికి 8 ఫైరింజన్‌లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మరణించిన వారందరూ బిహార్‌కు చెందిన వలస కార్మికులని అధికారులు తెలిపారు. వీరంతా చాప్రా జిల్లా ఆజంపుర గ్రామానికి చెందినవారు. మృతులను సికిందర్, బిట్టు, సత్యేందర్, గోలు, దామోదర్, రాజేశ్, దినేశ్, రాజు, చింటు, దీపక్ ,పంకజ్ గా గుర్తించారు.