EAPCET 2022-23: జులై 4 నుండి..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎపిఈఎపిసెట్) 2022-23 పరీక్షలు జులై 4వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఎపి రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డితో కలిసి ఎపి ఈఎపిసెట్ షెడ్యూల్‌ను విడుదలచేశారు. ఇంటర్మీడియట్ వెయిటేజి యథాతథంగా ఉంటుందని తెలిపారు.
ఇంజినీరింగ్, ఫార్మసి కోర్సుల్లో ప్రవేశానకి జులై 4 నుండి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఉంటుందని, రోజుకు రెండు సెషన్లు చొప్పున మొత్తం 10 సెషన్లతో ఈ పరీక్ష జరుగుతుంది. అగ్రికల్చర్ స్ట్రీమింగ్ పరీక్ష జులై 11,12 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది. పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేనెల 11వ తేదీన విడుదలవుతుందని మంత్రి తెలిపారు.