రూ.100 నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి: జ‌న‌సేనాని

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశం కోసం త్యాగం చేసిన వ్య‌క్తుల జీవితాల‌ను చ‌ద‌వ‌డం వ‌ల్లే త‌న‌కు జీవితం అంటే ఏమిటో తెలిసింద‌ని జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్‌కల్యాణ్ అన్నారు. హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ‘లెర్నింగ్ సెంట‌ర్ ఫ‌ర్ మ్యూమ‌న్ ఎక్స్‌లెన్స్’ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎం.వి.ఆర్‌.శాస్త్రి ర‌చించిన నేతాజి గ్రంథ స‌మీక్ష‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ‘ఎంవిఆర్ శాస్త్రిని ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు మాత్ర‌మే క‌లిశాను. ఆయ‌న సుమారు 20 పుస్త‌కాలు ర‌చించారు. సినిమా ఉచితంగా చూస్తానేమో కానీ పుస్త‌కాల‌ను మాత్రం ఇవ్వ‌ను. అనంత ప‌ద్మ‌నాభ స్వామి నేల‌మాళిగల్లో ఉన్న సంప‌ద కంటే గ్రంథాల‌యంలో ఉన్న పుస్త‌కాల‌కే ఎక్కువ విలువ‌. త్రివిక్ర‌మ్ వ‌స్తున్నాడంటే పుస్త‌కాల‌ను దాచేస్తాను. నేను సినిమా నటుడిన అవ్యాల‌ని ఎన్న‌డూ అనుకోలేదు. ప్ర‌జా సేవ‌లోకి రావాల‌ని అనుకోలేదు’ అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

నేతాజి సుభాస్ చంద్ర‌బోస్ గురించి మాట్లాడుతూ..” జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్య‌క్తి సుభాష్ చంద్ర‌బోస్. వంద రూపాయ‌ల నోటుపై నేతాజి బొమ్మ వేయాల‌ని అన్నారు. ఆయ‌న్ను గౌర‌వించ‌క‌పోతే మ‌నం భార‌తీయుల‌మే కాదు. ఈ దేశం నాద‌నుకునే నాయ‌కుడు ఒక్క‌డూ లేడు. ఎంతో మంది బ‌లిదానాల వ‌ల్లే ఈ రోజు దేశంలో స్వేచ్ఛ‌గా జీవిస్తున్నారు. ఆయ‌న కోసం కొత్త త‌రం క‌ద‌లాలి. నేతాజి అస్థిక‌లు రెంకోజి ఆల‌యంలో దిక్కులేకుండా ఉన్నాయి. ఆయ‌న అస్థిక‌లు తిరిగి తీసుకురావాలి. ఆ అస్థిక‌లు నేతాజివి అవునా, కాదా.. అని ప‌రీక్ష‌లు చేసి తేల్చ‌లేమా ? ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. నేతాజి అస్థిక‌లు దేశానికి తీసుకురావాల‌ని ప్ర‌జ‌లు కోరుకోవాలి”. అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.