మరియపోల్‌లోని థియేటర్‌పై రష్యా దాడి.. 300 మంది మృతి!

కీవ్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు కొనసాగిస్తుంది. కీవ్, ఖర్కివ్, మరియుపోల్ వంటి నగరాల్లో క్షిపణులు, బాంబు దాడులతో విజృంభిస్తున్నాయి. మరియుపోల్‌లో ఓ థియేటర్‌పై జరిపిన బాంబు దాడిలో 300 మంది మృతి చెందినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లోని ఓ పాఠశాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పాఠశాల భవనంలో తలదాచుకుంటున్నా అనేక మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆశ్రయం పొందుతున్న ఓ థియేటర్‌పై రష్యా జరిపిన దాడుల్లో 300 మంది మృతిచెంది ఉంటారని అధికారులు పేర్కొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి