తిరుమలలో టికెట్లకు పోటెత్తిన భక్తజనం
తిరుమల (CLiC2NEWS): వారాంతం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టికెట్ల కోసం భరీగా భక్తులు బారులు దీరారు. అలాగే అలిపిరి తనిఖీ కంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగింది. భక్తుల తాకిడి పెరగడంతో వాహనాల తనిఖీలు ఆలస్యం అవుతోంది. దీంతో భక్తులకు నిరీక్షణ తప్పడం లేదు.