AP: ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రారంభం..!
![](https://clic2news.com/wp-content/uploads/2022/03/AP-NEW-DISTRICTS.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ 2వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అన్ని జిల్లాల కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. రెవెన్యూ డివిజన్లు పెరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో విభజన జరుగుతున్నాయి. మరోవైపు ఆర్ధిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కొన్ని జిల్లాల పేర్లు మార్పు,కొన్ని మండలాలను మార్పులు వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.