యాదాద్రిలో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌..

యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి పుణ్య‌క్షేత్రంలో ఆల‌య ఉద్ఘాట‌న ప్ర‌క్రియ అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతుంది. దీనిలో భాగంగా మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సిఎం కెసిఆర్ స‌మ‌క్షంలో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. మిథ‌నున‌ల‌గ్నంలో ఏకాద‌శి సంద‌ర్భంగా ఈ మ‌హోత్స‌వం ఆవిష్కృత‌మైంది. ప్ర‌ధానాల‌యం గోపురాల‌పై కాల‌శాల‌ను కుంభాభిషేకం నిర్వహించారు. 7 గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ చేశారు. ఆల‌య రాజ‌గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు.

మ‌ధ్యాహ్నం 12.20 నిమిషాల‌న నుంచి గ‌ర్భాల‌యంలోని స్వామివారి ద‌ర్శ‌నం మొద‌లైంది. సిఎం కెసిఆర్ దంప‌తులు స్వామివారికి తొలిపూజ చేశారు. అనంత‌రం ఆల‌య పునర్నిర్మాణంలో భాగ‌స్వాములైన ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్ ఆనంద‌సాయితో పాటు మ‌రికొద‌రిని సిఎం, మంత్రులు స‌న్మానించారు.

Leave A Reply

Your email address will not be published.