ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్.. మిగిలింది రెండు రోజులే!

హైదరాబాద్ (CLiC2NEWS): ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ మరో రెండు రోజులలో ముగియనుంది. పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో ఈ నెల 31 లోపు కట్టేందుకు వీలు కల్పించిన విషయం తెలిసినదే. దీనికి మరో రెండు రోజులే గడువు ఉంది. ఇప్పటి వరకు ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకన్నారు. గడువు లోపు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని, గడువు తీరిన తర్వాత భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు.