నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నాగర్ కర్నూల్ (CLiC2NEWS): దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెదారు. ఇవాళ (శనివారం) తెల్లవారు జామున నాగార్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలం తుర్కపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపిన వివరా మేరకు… సూర్యాపేట జిల్లా నేరుచెర్ల మండల కేంద్రానికి చెందిన గౌస్ ఖాన్ (55) తన కుటుంబంతో కలిసి కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని తిరిగి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గౌస్ ఖాన్, అతని భార్య ఫరహాత్ (45), అక్క సాధికా (58), రోషణ్ జమీర్ (24) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గౌస్ ఖాన్ కొడుకు ఇతియాజ్ (21) తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నమిత్తం ఆసుపత్రికి తరలించరు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.