ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు మ‌రో అర‌గంట‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్‌సి ప‌రీక్షా స‌మ‌యాన్ని అర‌గంట పెంచామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. విద్యాశాఖాధికారుల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మే నెల‌లో జ‌ర‌గ‌నున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. గతంలో  ప‌రీక్షా స‌మ‌యం 2 గంట‌ల 45 నిమిషాలు ఉండ‌గా..  మ‌రోఅర‌గంట పెంచి 3.15 నిమిషాల స‌మ‌యం కొన‌సాగ‌నున్న‌ద‌ని తెలిపారు. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌బోయే ప‌రీక్ష‌ల‌కు ఐదు ల‌క్ష‌ల‌కు పైగా విద్యార్థులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆరు పేప‌ర్ల‌తోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు , 70% సిల‌బ‌స్‌నే అమ‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌శ్నాప‌త్రంతో అధిక చాయిస్ ఇస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.