రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నిధులు.. ఎపికి రూ. 879 కోట్లు
అమరావతి (CLiC2NEWS): దేశంలో రెవెన్యూ లోటు ఎదుర్కుంటున్న రాష్ట్రాలకు కేంద్రం శుక్రవారం నిధులు విడుదల చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 14 రాష్ట్రాలకు రూ. 7,183.42 కోట్లను తొలి విడతగా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. విభజన అనంతరం లోటు భర్తీకి గానూ 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.879.08 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మొత్తం రూ. 10,549 కోట్లు ఇవ్వాలని ఆర్ధిక సంఘం పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని మరో 11 విడతల్లో విడుదల చేయనున్నారు.