కొలువుదీరిన ఎపి కొత్త కేబినెట్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకరారం కార్యక్రమం ప్రారంభమైంది. రా్రష్ట సచివాలయం సమీపంలో పార్కింగ్ ప్రవేశం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ విశ్వభూషణ్ మరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, పలువురు ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
మొదట సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం అంజాద్ భాషా, ఆదిమూలపు సురేశ్, బొత్త సత్యానారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరామ్, జోగి రమేశ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పీడిక రాజన్నదొర, ఆర్కె రోజా, సీదరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని మంత్రులుగా ప్రమాణం చేశారు.