ఇంత దూరం వ‌చ్చి దీక్ష చేయాడానికి కార‌ణ‌మెవ‌రు? సిఎం కెసిఆర్

ఢిల్లి (CLiC2NEWS): కేంద్ర‌ప్ర‌భుత్వం ధాన్యం కొనాల‌ని సిఎం కెసిఆర్, ఎంపీలు దేశ రాజ‌ధాని ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో దీక్ష చేప‌ట్టారు. భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బికెయు) నేత రాకేశ్ టికాయ‌త్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి తెలంగాణ రైతుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చాలా బాధాక‌ర‌మైన‌వ‌న్నారు. ఎవ‌రితోనైనా గొడ‌వ ప‌డొచ్చుకాని, రైతుల‌తో ప‌డ‌వ‌ద్దు అన్నారు. తెలంగాణ‌లో పండించే ధాన్యం కేంద్ర‌మే కొనాల‌ని తెలంగాణ నుండి సుమారు 2 వేల కిలో మీట‌ర్లు వ‌చ్చి ఢిల్లీలో టిఆర్ ఎస్ దీక్ష చేప‌ట్టింది. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు అని ప్ర‌శ్నించారు.

24 గంట‌ల‌లోపు ధాన్యం సేక‌ర‌ణ కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని సిఎం డిమాండ్ చేశారు. మోడీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతుల పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కోరుతున్నామ‌ని కెసిఆర్ పేర్కొన్నారు.  ఈ సంద‌ర్భంగా దీక్ష‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు వ‌చ్చిన రైతు నేత టికాయ‌త్‌కు కెసిఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.