దేశంలో కొత్తగా 61,267 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటలలో 10,89,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 61,267 పాజిటివ్ కేసులు, 884 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,10,71,797 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,19,023గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,62,491కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1,03,569 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 84.70 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 13.75గా ఉంది.