పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక..

ఇస్లామాబాద్ (CLiCWNEWS): పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా పిఎంఎల్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (70) ఎన్నికయ్యారు. ప్రతిపక్షలు ప్రతిపాదించిన షహబాజ్కు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. పిటిఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉన్నషా మెహమ్ముద్ ఖురేషి ఈ పోటీ నుండి తప్పుకోవడంతో షెహబాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి జాతీయ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యింది. పిటిఐ పార్టి నేతలంతా మూకమ్మడి రాజీనామా చేసి, ప్రధాని ఎన్నికను బహిష్యరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.