దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంతో దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో 52 మంది దళిత బంధు లబ్ధిదారులకు గురువారం వాహనాలను అందజేశారు. దళితుల అభ్యున్నతి కోసం సిఎం కెసిఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందుతూ ఆర్ధికంగా ఎదగాలని సూచించారు.