గుమ్మడికాయలో దాగిఉన్న‌ అద్భుత‌మైన ఆరోగ్య ర‌హ‌స్యాలు..

తెలుగులో : గుమ్మడికాయ
హిందీలో :కుమ్ర
సంస్కృతలో :కూష్మాండా
ఊర్డులో : మిఠా కద్దు
లాటిన్ లో : కుకుబీటా మాక్సిమా అని అంటారు.

గుమ్మడికాయ ని తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెంచుతారు. కొందరికి గుమ్మడికాయ కూర అంటే ఆరోజు పండగలాగా చేసుకుంటారు. గుమ్మడి లోపలి భాగం ఆరంజ్ రంగులో ఉంటుంది. గుమ్మడి ఔషాదంగా, అహరముగా చాలా ప్రసిద్ధి చెంది వుంది. గుమ్మడికాయలో ఎన్నో పోషక విలువలు వున్నాయి.

  • కార్బో హైడ్రెట్
  • ప్రోటీన్
  • కొవ్వు
  • ఫైబర్
  • ఖనిజ లవణాలు
  • పోటాసియం
  • సోడియం
  • ఐరన్
  • కాల్షియం
  • ఫోస్పోరస్
  • క్లోరిన్
  • మెగ్నీసియం
  • కాపర్
  • విటమిన్ A, B
  • నికోటిన్ ఆసిడ్
  • సల్పర్ ఉంటాయి.
  • విటమిన్ b2, c ఉన్నాయి.

ప్ర‌యోజ‌నాలు..

గుమ్మడికాయ తొందరగా జిర్ణం కాదు. గుమ్మడికాయ మధురంగా ఉంటుంది. రుచిని పుట్టిస్తుంది. దేహపుష్టిని, బలం, వీర్యవృద్ధిని కలిగిస్తుంది. ఎక్కువగా తింటే వాతం చేస్తుంది.

గుమ్మడి గింజల యందు ప్రోటీన్ మరియు క్రొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే త్వరగా జిర్ణం అవుతాయి.

గుమ్మడి లేత ఆకులు చిగుర్ల‌ను కూరగా వండుకొని తినవచ్చును. ఇది వాతం, జ్వరం వాపులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది.
గుమ్మడి పువ్వులు కూడా కూర చేసుకొని తింటారు. ఇది పైత్యాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడి గింజలను నీళ్లు పోసి మెత్తగా రుబ్బి రసం తీసి అందులో నిమ్మరసం మరియు తేనే కలిపి వాడిన నోటి నుండి రక్తం పడుట, రక్తమొలలు, మరియు ప్రొస్టేట్ గ్లాండ్ పెరిగిన రోగులకు చాలా మంచిది.

గజ్జి, తామర జబ్బులకు దీని ఆకుల రసాన్ని రాసిన రోగులకు హితంగా ఉంటుంది.

దీని ఆకుల రసాన్ని గడ్డలు మీదా రాస్తే మెత్తబడి పగిలిపోతాయి.

గుమ్మడి గుజ్జు తీసి కాళ్లకు, చేతులకు రాస్తే మంట తగ్గుతుంది.

ఉత్తర భారతదేశంలో దీనితో స్వీట్స్ తయారుచేసి తింటారు, చాలా రుచిగా ఉంటుంది. దీనిని వాడేటపుడు శరీర దోషం బట్టి తినవలెను.

దీనిని పచ్చడిగా… పప్పులో కూడా వేసి తింటారు.

గుమ్మ‌డి కాయ ర‌కాలు..

బూడిద గుమ్మడి కాయని ఎంచుకునేటప్పుడు అది పైన పచ్చగా ఉండాలి. నునుపుగా స్థిరంగా ఉండాలి. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంచటానికి అవకాశం వుంది. దీనిని ఉత్తర భారత దేశంలో ఆగ్రా ఇతర ప్రాంతాలలో పేట (sweet) అంటారు. దీనితో స్వీట్ తయారు చేస్తారు.ఇది గుమ్మడికాయ‌ను చిన్న చిన్న ముక్కలుగా త‌రిగి… ఉడికించి దానిలో పంచదార కలిపి ఎండపెట్టి తింటారు. ఇది చాలా స్వీట్ గా ఉంటుంది.

దీనిని పెసరపప్పు లో చిన్న చిన్న ముక్కలుగా వేసి వండవచ్చును. అలాగే ఇతర కూరలలో కూడా వేసి వండుకోవచ్చును.

దీనిని వడియాలు గా చేసుకుని తినవచ్చును. అంతేకాకుండా దీన్ని juice కూడా తయాచేసుకొని తాగవచ్చును. దీనిని సాంబారులో కూడా వేసుకోవచ్చును.

ఇది ముత్రాన్ని జారగోడుతుంది. దీనిలో క్రొవ్వు, కార్బో హైడ్రెట్స్ తక్కువగా ఉంటాయి. బరువు వున్నవారు తగ్గటానికి డైట్ లి చక్కగా వాడుకోవచ్చును.

బూడిద గుమ్మడి కాయని ముక్కలుగా తరిగి ఉడికించి దానిలో షుగర్ వేసి కలిపి తింటే గుండె జబ్బులు వున్నవారికి మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుమ్మడికాయ ముక్కలుగా తరిగి juice చేసి దానిలో సమానంగా నీరు కలిపి తాగితే పెప్టిక్ అల్సర్ తగ్గుతుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది.

ఎండాకాలంలో దీని స్వీట్ రూపంలో కానీ రసం రూపంలో కానీ తీసుకుంటే శరీర తాపం తీరుతుంది.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు
సెల్‌: 73961 26557

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: Immunity Booster: బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్

Leave A Reply

Your email address will not be published.