చేతికి ఎముక‌లేని త‌నానికి కెసిఆర్ ట్రేడ్‌మార్క్‌: సిజెఐ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): చేతికి ఎముక‌లేద‌న‌డానికి ట్రేడ్‌మార్క్ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ అన్నారు. దేశంలో కేసులు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారానికి జ‌డ్జిల సంఖ్య‌పెంపు అవ‌స‌ర‌మ‌ని జ‌స్టిస్ ఎన్ వి ర‌మ‌ణ అన్నారు. తెలంగాణ హైకోర్టులో ఇటీవ‌ల జ‌డ్జిల సంఖ్య పెంచామ‌ని.. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జ‌డ్జిల సంఖ్య పెంపు అంశాన్ని ప‌రిష్క‌రించామ‌ని చెప్పారు. గ‌చ్చిబౌలిలోని అన్వ‌య క‌న్వెన్ష‌న్‌లో సెంట‌ర్‌లో నిర్వ‌హించిన తెలంగాణ న్యాయాధికారుల స‌ద‌స్సులో సిఎం కెసిఆర్‌, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీశ్‌చంద్ర శ‌ర్మ‌తో క‌లిసి సిజెఐ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సిజెఐ జ‌స్టిస్ ఎన్ వి. ర‌మ‌ణ మాట్లాడారు… న్యాయ‌వ్య‌వ‌స్థ ఇంకా బ‌ల‌ప‌ర‌చాల‌ని భావిస్తున్నామ‌ని.. జిల్లా కోర్టుల్లోనూ జ‌డ్జిల సంఖ్య‌ను పెంచుతున్నామ‌ని చెప్పారు.
అలాగే “ మౌలిక వ‌సతులు, ఖాళీల భ‌ర్తీపై దృష్టిపెట్టాం, న్యాయ‌వ్య‌వ‌స్థ మాన‌వీయ కోణంలో ప‌నిచేయాలి. అన్ని వ‌ర్గాల‌నూ స‌మానంగా గౌర‌వించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పుల‌కు అప్‌గ్రేడ్ కావాలి, న్యాయ‌మూర్తులు ఎలాంటి భ‌యం లేకుండా ప‌నిచేయాలి. న్యాయ‌మూర్తుల‌పై భౌతిక దాడులు జ‌రుగుతున్నాయి. న్యాయాధికారులు ఆరోగ్యం, కుటుంబంపై దృష్టిపెట్టాలి. న్యాయాధికారుల పే క‌మిష‌న్ సంబంధించి త్వ‌ర‌లో శుభ‌వార్త ఉంటుంది“ అని సిజెఐ తెలిపారు.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ మీడియేష‌న్ సెంట‌ర్ వ‌చ్చింద‌ని చెప్పారు. వివాదాల స‌త్వ‌ర ప‌రిష్కారానికి ఈ కేంద్రం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. త‌మ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నార‌ని వెల్ల‌డించారు.

దేశ‌వ్యాప్తంగా, రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో నియ‌మించుకుని ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించాల‌ని భావిస్తుంటారు. తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ మాత్రం 4,320 పైగా ఉద్యోగాల‌ను సృష్టించార‌ని చెప్పారు. చేతికి ఎముక లేని త‌నానికి ట్రేడ్ మార్క్ సిఎం కెసిఆర్ అని జ‌స్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ కొనియాడారు. న్యాయ‌వ్య‌వ‌స్థ త‌ర‌ఫున కెసిఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుకొంటున్నామ‌న్నారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చొర‌వ‌తోనే ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం: ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

Leave A Reply

Your email address will not be published.