పంజాబ్ ప్రజలకు ఆప్ సర్కార్ శుభవార్త..
ప్రతి ఇంటికి 300 యూనిట్ట వరకు ఉచిత విద్యుత్

చండీగఢ్ (CLiC2NEWS): పంజాబ్ రాష్ట్రంలోని ప్రజలకు భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. జులై 1వ తేది నుండి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో భగవంత్ మాన్ ఇటీవల సమావేశమై ఈ విషయంపై చర్చించారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉచిత విద్యుత్‌పై నేడు ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కార్ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.