పేద‌ల ఇండ్ల‌కు రాయితీపై 140 బ‌స్తాల సిమెంట్‌

రాయితీ 90 బ‌స్తాల నుండి 140 బ‌స్తాల‌కు పెంపు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌వ‌రత్నాలు- పేద‌లంద‌రికీ ఇళ్ళు ప‌థ‌కం కింద గృహ నిర్మాణ ల‌బ్ధిదారుల‌కు ప్ర‌స్తుతం ఇస్తున్న 90 బ‌స్తాల సిమెంట్‌ను 140 బ‌స్తాల‌కు పెంచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్య‌తుల చేప‌ట్టిన జోగి ర‌మేష్ విశాఖ‌ప‌ట్నంలో ల‌క్ష మంది మ‌హిళ‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లు మంజూరు ఫైలుపై తొలిసంత‌కం చేశారు. అనంత‌రం గృహ నిర్మాణ అబ్దిదారుకు 140 బ‌స్తాల సిమెంట్ ఇచ్చే ఫైల్‌పై రెండో సంత‌కం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ర‌మేష్ మాట్లాడుతూ.. ల‌బ్ధిదారుల‌కు మరింత ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని అన్నారు. నేడు కులం, మతం, ప్రాంతం, పార్టీల‌కు అతీతంగా ఆర్హులైన ప్ర‌తి ఒక్క పేద కుటుంబానికి సంతృప్త స్థాయిలో ఇళ్లు మంజూరు చేశామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.