రాష్ట్రంలో మరో 10 లక్షల కొత్త పింఛన్లు: మంత్రి హరీశ్‌రావు
అభయ హస్తం నిధుల పంపిణీ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొత్ పింఛన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సంగారెడ్డి మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి, అభయహస్తం కార్పస్ ఫండ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం రూ. 500 పింఛన్ కోసం కట్టారని, ఇప్పుడు వడ్డీతో సహా కలిసి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 545 కోట్లు తిరిగి ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజి తెలంగాణలోనే నంబర్ వన్ అని, రూ. 672 కోట్ల బ్యాంక్ లింకేజి ఇచ్చామన్నారు.