వ్యవసాయరంగంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణలో వ్యవసాయ రంగంపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో యాసంగి వరి దాన్యంపై చర్చజరుగుతున్నట్లు సమాచారం. దళితబంధు పథకం తీరుతెన్నులను కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సమాచారం.