భారీగా పెరిగిన బంగారం ధరలు..

హైదరాబాద్ (CLiC2NEWS): పెళ్లిళ్ల సీజన్‌తో గోల్డ్ కొండెక్కింది. బంగారం ధరలు పైపైకి కదలడంతో బంగారం కొనాలనుకునే వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజాగా బంగారం, వెండి ధరలు సోమవారం రోజున భారీగా పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం… యుఎస్ ఫెడ్ రిజర్వ్ ధ్రవ్యవిధానలను కఠినతరం చేసే అవకాశాలు.. ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావం తదితర కారణాలతో అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు పెరిగాయి.
ముంబయికి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ ప్రకారం…
హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దర రూ. 320 పెరిగి రూ. 54,380 కి చేరింది.
నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 49,850కి పెరిగింది.
ఇక సిల్వర్ దరలు సోమవారం ఏకంగా రూ. 1000కి పెరిగి కిలో వెండి ధర రూ. 75,200కు చేరింది. మంగళవారం వెండి ధరలు కాస్త తగ్గాయి.
కిలో వెండి ధర రూ. 300 తగ్గి రూ. 74,900వద్ద ఉంది.